• హల్లెలుయ - స్తుతి మహిమ

  హల్లెలుయ - స్తుతి మహిమ
  ఎల్లప్పుడు - దేవునికిచ్చెదము
  ఆ హల్లెలుయ .. హల్లెలుయ ..హల్లెలుయ

  అల సైన్యములకు - అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము
  అల సంద్రములను - దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము

  ఆకాశము నుండి - మన్నాను పంపిన దేవుని - స్తుతించెదము
  బండ నుండి మధుర - జలమును పంపిన ఆ యెహోవాను - స్తుతించెదము
  /font>

 • ఆయనే నా సంగీతము

  ఆయనే నా సంగీతము - బలమైన కోటయును
  జీవాది పతియు ఆయనే - జీవిత కాలమెల్ల స్తుతించెదను
  ఆయనే నా సంగీతము

  1. స్తుతుల మధ్యలో నివాసం చేసే - దూతలెల్ల పొగడే దేవుడాయనే
  వేడుచుండు భక్తుల మొరలు వినే - దిక్కులేని పిల్లలకు దేవుడాయనే || ఆయనే ||

  2. ఇద్దరు ముగ్గురు నా నామమున - ఏకీభవించిన వారి మధ్యాలోన
  ఉండేధననిన మన దేవుని - కరములు తట్టి నిత్యం స్తుతించెదము || ఆయనే ||
  3. సృష్టికర్త క్రీస్తు యేసు నామమును - జీవితకాలమేల్ల కీర్తించేదము
  రాకడలో ప్రభుతో నిత్యముందుము - మ్రోక్కేదము స్తుతింతుము - పొగడెదము || ఆయనే ||

 • అన్ని నామముల కన్న పై నామము-యేసుని నామము

  అన్ని నామముల కన్న పై నామము-యేసుని నామము
  ఎన్ని తరములకైన ఘనపరచ దగినది-క్రీస్తేసు నామము
  యేసు నామము జయం జయము -సాతాను శక్తుల్ లయం లయము
  హల్లెలూయ హొసన్న హల్లెలూయ-హల్లెలూయ ఆమెన్

  1. పాపముల నుండి విడిపించును-యేసుని నామము
  నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును-క్రీస్తేసు నామము
  యేసు నామము జయం జయము -సాతాను శక్తుల్ లయం లయము
  హల్లెలూయ హొసన్న హల్లెలూయ-హల్లెలూయ ఆమెన్ (2)

  2. సాతాను పై అధికార మిచ్చును-శక్తి గల యేసు నామము
  శత్రు సమూహము పై జయమునిచ్చును-జయశీలుడైన యేసు నామము
  యేసు నామము జయం జయము -సాతాను శక్తుల్ లయం లయము
  హల్లెలూయ హొసన్న హల్లెలూయ-హల్లెలూయ ఆమెన్ (2)

  3. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు-క్రొత్త కీర్తన పాడెధము
  జయ ధ్వజమును పైకెత్తి కేకలతో-స్తోత్ర గానము చేయుదము
  యేసు నామము జయం జయము -సాతాను శక్తుల్ లయం లయము
  హల్లెలూయ హొసన్న హల్లెలూయ-హల్లెలూయ ఆమెన్ (2)

  అన్ని నామముల కన్న పై నామము-యేసుని నామము
  ఎన్ని తరములకైన ఘనపరచ దగినది-క్రీస్తేసు నామము
  యేసు నామము జయం జయము -సాతాను శక్తుల్ లయం లయము
  హల్లెలూయ హొసన్న హల్లెలూయ-హల్లెలూయ ఆమెన్ (2)

 • ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త

  ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు
  లోకన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు
  రండి మన హృదయాలను ఆయనకు అర్పించి
  ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము - ఆరాధించెదము

  ఆరధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన
  పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతిశ్రేష్టుడు
  రాజులకే రారాజు ఆ ప్రభువుని పూజించెదమ్
  హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

  సత్య స్వరూపి సర్వాంతర్యామి సర్వాదికారా మంచి కాపరి
  వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమ గలవాడు మహాదేవుడు
  రండి మనమందరము ఉత్సాహ గానములతో
  ఆ దేవా దేవుని ఆరాధించెదము - ఆరాధించెదము

  ఆరధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన
  పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతిశ్రేష్టుడు
  రాజులకే రారాజు ఆ ప్రభువుని పూజించెదమ్
  హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

 • ఎందుకో నన్నింతగా నీవు - ప్రేమించితివో దేవ

  ఎందుకో నన్నింతగా నీవు - ప్రేమించితివో దేవ
  అందుకో నా దీన స్తుతి పాత్ర - హల్లెలూయ యేసయ్య (2)

  1. నా పాపము బాప - నరరూపి వైనావు
  నా శాపము మాప - నలిగి వ్రేలాడితివి
  నాకు చాలిన దేవుడవు నీవే - నా స్థానములో నీవే (2)

  2. నీ రూపము నాలో - నిర్మించియున్నావు
  నీ పోలికలోనే - నివసించమన్నావు
  నీవు నన్ను ఎన్నుకుంటివి - నీ కొరకై నీ కృపలో (2)

  3. నా మనవులు ముందే - నీ మనసులో నెరవేరే
  నా మనుగడ ముందే - నీ గ్రంధములో నుండే
  ఏమి అధ్భుత ప్రేమ సంకల్పం - నేనేమి చెల్లింతును (2)

  4. నా శ్రమలు సహించి - నా ఆశ్రయమైనావు
  నా వ్యధలు భరించి - నన్నాదుకున్నావు
  నన్ను నీలో చేర్చుకున్నావు - నను దాచియున్నావు (2)

  5. నీ సన్నిధి నాలో - నా సర్వమును నీలో
  నీ సంపద నాలో - నా సర్వస్వము నీలో
  నీవు నేను ఏకమగువరకు - నను విడువనంటివి (2)

 • ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా

  ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా
  అపాయమేమియు రానే రాదు రానేరాదయ్యా - ల లా
  ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని -
  ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయ పరచితివి
  గొఱ్ఱెపిల్ల రక్తముతో సాతనున్ జయించెదము
  ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదము

  దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్దము కానేకావు
  కదలకుండా స్థిరముగా ప్రయాసపడెదము
  మన యొక్క నివాసము పరలోకమందున్నది
  రానైయున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టెదం
  ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా
  అపాయమేమియు రానే రాదు రానేరాదయ్యా - ల లా

 • క్రీస్తు నీకేమి చేయగలడో

  క్రీస్తు నీకేమి చేయగలడో కోరుకో ఓ యువతా నవతా (2)
  నీవు రేపటి సంఘ సమతవు వేడుకో ఓ యువతా మమతా
  క్రీస్తు నీకేమి చేయగలడో కోరుకో ఓ యువతా నవతా

  దేవా పరిశుద్ధ హృదయమును నాలోన కలుగాజేయుమని
  దైవ మనసును కోరుకొనెను దావీదు గొర్రెల కాపరి
  దేవా వివేక హృదయమును లోలోన ప్రసాదించుమని
  దైవ జ్ఞానము కోరుకొనెను సోలోమోను మహారాజు ||క్రీస్తు||

  దేవా నీ దివ్య దృష్టిని దయతో దయచేయుమని
  దైవ మార్గము కోరుకొనెను భక్తిమై గుడ్డి భిక్షకుడు
  యేసూ నీ రాజ్యములో నను జ్ఞాపకము చేసుకోమని
  దైవ సన్నిధి కోరుకొనెను సిల్వలో వ్రేలాడు దొంగ ||క్రీస్తు||

 • గాడాంధకారములో - నేను తిరిగిననుమ

  గాడాంధకారములో - నేను తిరిగినను, నేనేల భయపడుదు - నాతోడు నీవుండగా (2)
  గాడాంధకారములో...

  1. ఎన్నెన్నో ఆపదలు - నన్ను చుట్టిననూ, నిన్ను తలచినచో - నన్ను విడనాడు (2)
  అన్నికాలముల - నిన్నే స్మరియింతు, ఎన్నరానివయ్యా - నీకున్న సుగుణములు (2) || గాడాంధ ||

  2. నాకున్న మనుజులెల్ల - నన్ను విడచినను, నా దేవ ఎపుడైన - నన్ను విడచితివా (2)
  నా హృదయ కమలమున - నిను నేను నిలిపెదను, నీ పాదకమలముల - నా దేవ కొలిచెదను (2) || గాడాంధ ||

 • జన్మించె రక్షకుడు ఈ జగతిలో

  జన్మించె రక్షకుడు ఈ జగతిలో
  అరుదెంచె ఆ దేవుడే నరరూపులో
  నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను రక్షింప
  నరుడై వెలుగై ..యేసు ఉదయించె
  మహోన్నతుడు పాపి కొరకు ... పరలొకము వీడినాడు
  మహాఘనుడు దీనుడై ... తగ్గించుకున్నాడు
  నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను రక్షింప
  నరుడై వెలుగై ..యేసు ఉదయించె

  పాపానికి ప్రాయశ్చిత్తము ... చేయువారు ఎవ్వరు లేరు
  ప్రతివారిని విమొచింపను ... సిలువలో బలి అయినాడు
  నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను రక్షింప
  నరుడై వెలుగై ..యేసు ఉదయించె

  దూరమైన నిన్ను చేరి ... నీ ఘోర స్థితినే మార్చి
  పాప శాప భారము దించి..శాంతినివ్వ యేసు వచ్చె
  నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను రక్షింప
  నరుడై వెలుగై ..యేసు ఉదయించె

  జన్మించె రక్షకుడు ఈ జగతిలో
  అరుదెంచె ఆ దేవుడే నరరూపులో

 • జయము ఇచ్చు

  జయము ఇచ్చు దేవునికి కోట్ల కోట్ల స్త్రోత్రం - జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంత స్త్రోత్రం
  హల్లేలూయ హల్లేలూయ పాడెదము - ఆనంద ద్వనితొ సాగెదము

  1. నీతి కరముచే తాకి నడుపును (2)
  దేవుడే మా బలం దేనికి భయపడం (2)
  2. అధ్భుత దేవుడు శ్రుష్టి కారకుడు (2)
  యుద్ధములో ప్రవీనుడు – రక్షకుడు జయించుము (2)

  3. నిజమైన దేవుడు సత్యవంతుడు (2)
  కాపాడు వాడు కునుకడు నిద్రించడు (2)

 • జీవనదిని నా హృదయములో

  జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా (2)

  1. శరీరక్రియలన్నియూ నాలో నశింపజేయుమయా || జీవనదిని ||
  2. బలహీనసమయములో నీ బలము ప్రసాదించుమూ || జీవనదిని ||
  3. ఆత్మీయవరములతో నన్ను అభిషేకం చేయుమయా || జీవనదిని ||

 • దుప్పి నీటి వాగుల కొరకు

  దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడునట్లుగా (2)
  నా ప్రాణము నా దేవుని కొరకు ఆశ పడుచున్నది
  నా ప్రాణము నా దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది

  నా ప్రాణము నా దేవుని కొరకు ఆశ పడుచున్నది
  నా ప్రాణము నా దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది
  Repeat whole song – 2

 • దూత పాట పాడుఁడీ

  1. దూత పాట పాడుఁడీ - రక్షకున్ స్తుతించుడీ
  ఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందునన్
  భూజనంబు కెల్లను - సౌఖ్యసంభ్ర మాయెను
  ఆకసంబునందున - మ్రోగు పాట చాటుఁడీ
  దూత పాట పాడుఁడీ - రక్షకున్ స్తుతించుడీ

  2. ఊర్ధ్వలోకమందునఁ - గొల్వఁగాను సుద్ధులు
  అంత్యకాలమందున - కన్యగర్భమందున
  బుట్టినట్టి రక్షకా - ఓ యిమ్మానుయేల్ ప్రభో
  ఓ నరావతారుఁడా - నిన్ను నెన్న శక్యమా
  దూత పాట పాడుఁడీ - రక్షకున్ స్తుతించుడీ

  3. దావె నీతి సూర్యుఁడా - రావె దేవపుత్రుఁడా
  నీదు రాకవల్లను - లోక సౌఖ్య మాయెను
  భూనివాసు లందఱు - మృత్యు భీతి గెల్తురు
  నిన్ను నమ్మువారికి - ఆత్మశుధి కల్గును
  దూత పాట పాడుఁడీ - రక్షకున్ స్తుతించుడీ

 • దేవా నీ మార్గమును

  దేవా నీ మార్గమును నేర్పించుము యేసయ్య (2)
  నీ వాక్యమే నా ప్రాణము నా ఊపిరి (2)
  దేవా నీ మార్గమును నేర్పించుము యేసయ్య

 • దేవా మహోన్నతుడా

  దేవా మహోన్నతుడా - మహిమా ప్రకాశితుడా (2)
  పదివేలలో అతి సుందరుడా -కీర్తింతు మనసారా (2)
  దేవా మహోన్నతుడా - మహిమా ప్రకాశితుడా
  దేవా మహోన్నతుడా..

  1. వెలిశావు భువిలో మెస్సయ్యగా - ఎడారి బ్రతుకులో సెలయేరుగా (2)
  నిస్సారమైన నాజీవితంలో - చిగురించే ఆనందము (2)

  దేవా మహోన్నతుడా - మహిమా ప్రకాశితుడా
  దేవా మహోన్నతుడా
  2. లేచాను వంటరి విశ్వాసినై - వెదికాను నీదరి అన్వేశినై (2)
  నీదివ్య మార్గము దర్శించిన - ఫలియించె నాజన్మము (2)

  దేవా మహోన్నతుడా - మహిమా ప్రకాశితుడా (2)
  పదివేలలో అతి సుందరుడా - కీర్తింతు మనసారా (2)
  దేవా మహోన్నతుడా - మహిమా ప్రకాశితుడా
  దేవా మహోన్నతుడా

 • దేవా! వెంబడించితి

  దేవా! వెంబడించితి నీ నామమున్ - జీవితేశ్వర నా జీవితాశ నీవే =
  రావె నా భాగ్యమా యేసువా ॥దేవా॥

  1. యేసూ! నీదు ప్రేమను నే వింటిని - భాసురంబగు నీ సిలువ నే గంటిని =
  యేసువాడను నే నంటిని ॥దేవా॥

  2. ప్రభో ప్రారంభించితి ప్రయాణమున్ - పరలోక యేరుషలేము పురికిన్ =
  పావనా జూపుము మార్గము ॥దేవా॥

  3. నాధా ఈధలేను ఈ ప్రవాహమున్ - నీదరిన్ గాన నీ కెరటాలధాటిచే =
  నావికా రమ్ము నన్ బ్రోవుము ॥దేవా॥

  4. స్వామీ! నీదు ప్రేమకు నే సాక్షిని - సంఘమందున నా పొరుగువారికి నీ =
  సత్య సువార్త నే జాటుదున్ ॥దేవా॥

  5. రాజా! నీదు రాజ్యములో జేరితి - రమ్యమౌ రాజ్యమందున నన్ వాడుము =
  రక్షణానందము గూర్చుము ॥దేవా॥

 • దేవుడే నా కాశ్రయంబు

  దేవుడే నా కాశ్రయంబు - దివ్యమైన - దుర్గము –
  మహావినోదు డాపదల స - హాయుడై నన్ బ్రోచును

  అభయ మభయ-మభయ మెప్పు-డానంద-మానంద మానంద మౌగ –
  దేవుడే నా కాశ్రయంబు - దివ్యమైన – దుర్గము

  1. పర్వతములు కదలిన నీ - యుర్వి మారుపడినను =
  సర్వమున్ ఘోషించుచు నీ - సంద్ర ముప్పొంగినన్ || అభయ ||

  2. దేవుడెప్డు తోడుగాక - దేశము వర్థిల్లును =
  ఆ తావునందు ప్రజలు మిగుల - ధన్యులై వసింతురు || అభయ ||

  3. రాజ్యముల్ కంపించిన భూ - రాష్ట్రముల్ ఘోషించిన =
  పూజ్యుడౌ యెహోవా వైరి - బూని సంహరించును || అభయ ||

  4. పిశాచిపూర్ణబలము నాతో - పెనుగులాడ జడియును =
  నశించి శత్రుగణము దేవు - నాజ్ఞవలన మడియును || అభయ ||

  5. కోటయు నాశ్రయమునై యా-కోబు దేవుడుండగ =
  ఏటి కింక వెరవవలయు - నెప్డు నాకు పండుగ || అభయ ||

 • దేహమే దేవుని గుడారము

  దేహమే దేవుని గుడారము - హృదయమే దేవుని ఆలయము
  మనసే దేవుని ఆసనము - ఆత్మే దేవుని నివాసము
  ఓ సంఘమా సౌభాగ్యమా - సర్వోన్నతుని సర్వాంగమా (2)

  1. చీల్చివేసి పాపపు చెరను - కూల్చివేసి శాపపు తెరను (2)
  కన్నది నిన్నే యేసు సిలువే - కొన్నది నిన్నే క్రీస్తు సిలువే (2)
  ఓ సంఘమా సౌభాగ్యమా - సర్వోన్నతుని సర్వాంగమా (2) || దేహమే ||

  2. దిన దినం వధకు తేబడే - గొరియ పిల్ల క్రైస్తవ సంఘం (2)
  క్షణ క్షణం యేసుని మోసే - గాడిద పిల్ల క్రైస్తవ జీవితం (2)
  ఓ సంఘమా సౌభాగ్యమా - సర్వోన్నతుని సర్వాంగమా (2) || దేహమే ||

  3. నీవుగాక లెక్కెవరు యేసుకు - క్రీస్తు లేక దిక్కెవరు నీకు (2)
  నీవు యేసులో తరగి కరగాలి - క్రీస్తు నీలో పెరిగి ప్రబలాలి (2)
  ఓ సంఘమా సౌభాగ్యమా - సర్వోన్నతుని సర్వాంగమా (2) || దేహమే ||

 • నడిపించు నా నావ

  నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా
  నవ జీవన మార్గమున - నా జన్మ తరియింప
  నడిపించు నా నావ…

  1. నా జీవిత తీరమున - నా అపజయ భారమున
  నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు
  నాయాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప
  నా నావలో కాలిడుము - నా సేవ జేకొనుము || నడిపించు ||

  2. రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము
  రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము
  రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
  రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ || నడిపించు ||

  3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
  అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి
  ఆశ నిరాశాయే - ఆవేద నెదురాయే
  ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడె నా వలలు || నడిపించు ||

  4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్ధించుట మానితిని
  ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని
  ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును పొంది
  ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీ మాట || నడిపించు ||

  5. ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకొని
  ప్రకతింతును లోకములో - పరిశుధ్ధుని ప్రేమకథ
  పరమాత్మ ప్రోక్షణలో - పరిపూర్ణ సమర్పణతో
  ప్రాణంబును ప్రభు కొరకు - పానార్పణము జేతు || నడిపించు ||

 • నా ప్రాణమా యెహోవాను

  నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము సన్నుతించుము
  నా అంతరంగ మందున్న సమస్తమా
  ఆయన పరిశుద్ద నామమును సన్నుతించుము

 • జీవనదిని నా హృదయములో

  జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా (2)

  1. శరీరక్రియలన్నియూ నాలో నశింపజేయుమయా || జీవనదిని ||
  2. బలహీనసమయములో నీ బలము ప్రసాదించుమూ || జీవనదిని ||
  3. ఆత్మీయవరములతో నన్ను అభిషేకం చేయుమయా || జీవనదిని ||

        Church Timings
Worship Service
Every Sunday at 4:30PM
With Holy Communion and Sunday School for kids

Fasting Prayer
Every Friday at 7:30PM

Women's Prayer cell Monday - Friday at 6am
For more information Rev Samuel E. Paul
301-404-8198
or
301-404-6734
Email: fmtc.md@gmail.com

Like our Youtube Chanel @ FMTC.MD

Like us on Facebook @ FMTC.MD